తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... స్కూల్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగిస్తూ జీవో
- ఈ మేరకు జీవో జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ
- తెలంగాణ వ్యాప్తంగా 28,200 మహిళా సంఘాలకు యూనిఫామ్‌లు కుట్టే బాధ్యత అప్పగింత
- 63.44 లక్షల డ్రెస్సులను కుట్టనున్న మహిళా సంఘాలు
- 45 రోజుల్లో యూనిఫామ్స్ కుట్టాలని పేర్కొన్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ విద్యార్థుల యూనిఫామ్‌లు కుట్టే పనులను మహిళా సంఘాలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు జీవో జారీ చేసింది. ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 28,200 మహిళా సంఘాలకు యూనిఫామ్‌లు కుట్టే బాధ్యతలను అప్పగించనుంది. 63.44 లక్షల డ్రెస్సులను మహిళా సంఘాలు కుట్టనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేసింది.
ఆయా జిల్లాల పరిధిలో డిపార్ట్‌మెంట్ల వారీగా ఎన్ని స్కూల్ యూనిఫారాలు కుట్టించాలనే వివరాలను జిల్లా కలెక్టర్లు రూపొందించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో, విద్యా శాఖ, అన్ని ఇతర రెసిడెన్షియల్ సంక్షేమ పాఠశాలలకు 63.44 లక్షల జతల యూనిఫామ్స్ అవసరమవుతాయి. ఈ యూనిఫామ్స్‌ను 45 రోజుల్లో కుట్టించాల్సి ఉంటుంది.