48 మంది ఎంపీ అభ్యర్థులతో రెండో జాబితా ప్రకటించిన కాంగ్రెస్

  • అసోం నుంచి 12 మంది, గుజరాత్ నుంచి 7 పేర్లు ప్రకటన
  • మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి పదేసి మంది అభ్యర్థుల వెల్లడి
  • మాజీ సీఎంలు కమల్ నాథ్, అశోక్ గెహ్లాట్ కుమారులకు సీట్ల కేటాయింపు
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 43 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రకటించింది. ఈ జాబితాలో అసోం నుంచి 12, గుజరాత్ నుంచి 7, మధ్యప్రదేశ్ నుంచి 10, రాజస్థాన్ నుంచి 10, డామన్ డయ్యూ నుంచి ఒక్కరి పేర్లను పార్టీ వెల్లడించింది. రెండో జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్లో 76.7 శాతం మైనార్టీ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన కులాలకు చెందినవారేనని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.

కాగా ఈ జాబితాలో చోటు దక్కిన ప్రముఖ వ్యక్తుల జాబితాలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో చింద్వారా నియోజకవర్గం నుంచి పార్టీ ఆయనను బరిలోకి దింపింది. ప్రస్తుతం ఆ స్థానం నుంచి ఆయన సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు టికెట్‌ను ఖరారు చేసింది. రాజస్థాన్‌లోని జలోర్‌ స్థానం నుంచి పోటీకి నిలబెట్టింది. ఇక అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కొడుకు గౌరవ్ గొగోయ్‌ పేరుని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. అసోంలోని జోర్హాట్ సీటును కేటాయించింది. ప్రస్తుతం ఆయన రాష్ట్రంలోని కలియాబోర్ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు.


More Telugu News