ఈ కారణం వల్లే పులపర్తిని జనసేనలో చేర్చుకుంటున్నాం: పవన్ కల్యాణ్

  • జనసేన తీర్థం పుచ్చుకున్న భీమవరం మాజీ ఎమ్మెల్యే
  • పులపర్తి ఆంజనేయులుకు జనసేన కండువా కప్పిన పవన్
  • పులపర్తి గొడవలు తగ్గించే వ్యక్తి అని వెల్లడి
  • అలాంటి నేతలు తన వెంట ఉండాలని ఆకాంక్ష
భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు ఇవాళ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ సమక్షంలో పులపర్తి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

గ్రంథి శ్రీనివాస్ కాపు కులస్తుడని, మనవాడని అందరూ వెనకేసుకొస్తే... అతడు చేసే చెడ్డపనులన్నీ, దుర్మార్గపు పనులన్నీ ఆ చుట్టుపక్కల కాపు సామాజిక వర్గీయులందరికీ వర్తిస్తాయి అని పవన్ హెచ్చరించారు. ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం అని అన్నారు. 

"ఏ పార్టీలోకి అయినా సమాజంలో గొడవలు తగ్గించేవాడు రావాలి కానీ, గొడవలు పెంచేవాడు రాకూడదు. నేను పులపర్తి ఆంజనేయులు గారిని ఎందుకు పార్టీలోకి ఆహ్వానించాను అంటే... ఆయన గొడవ తగ్గించే వ్యక్తి. నిబద్ధతతో నిలబడే వ్యక్తి. ఇలాంటి వాళ్లు జనసేన వెంట, నా వెంట ఉండాలి. గత కొన్నేళ్లుగా ఆయనను చూస్తున్నాను... కొన్ని బలమైన నిర్ణయాలు తీసుకున్నారు" అని పవన్ కల్యాణ్ వివరించారు.


More Telugu News