భాగ్యనగరాన్ని గెలిచి ప్రధాని మోదీకి బహుమతిగా ఇద్దాం: హైదరాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి మాధవీలత
- తాము రజాకార్లమేనని అక్బరుద్దీన్ ఒవైసీ గతంలో చెప్పారన్న మాధవీలత
- అలాంటి రజాకార్ల పాలన అంతం కావాలని చేసిన పోరాటంలో ఎంతోమంది తీవ్రంగా నష్టపోయారని వెల్లడి
- ప్రజల డబ్బు ప్రజలే అనుభవించాలని భావించి... ఆ దిశగా పని చేస్తోన్న నేత ప్రధాని మోదీ ఒక్కరేనని వ్యాఖ్య
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగ్యనగరాన్ని (హైదరాబాద్ పార్లమెంట్ స్థానం) గెలిచి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా ఇద్దామని హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత పిలుపునిచ్చారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మజ్లిస్ పార్టీ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ 2011లో మాట్లాడుతూ తాము రజాకార్లమేనని చెప్పారని గుర్తు చేశారు. అలాంటి రజాకార్ల పాలన అంతం కావాలని చేసిన పోరాటంలో ఎంతోమంది తీవ్రంగా నష్టపోయారన్నారు.
ప్రజల డబ్బు ప్రజలే అనుభవించాలని భావించి... ఆ దిశగా పని చేస్తోన్న నేత ప్రధాని మోదీ ఒక్కరే అన్నారు. లక్షల కోట్ల రూపాయల డబ్బును ప్రజలకే ఖర్చు పెడుతున్న నాయకుడు మోదీ అన్నారు. మహిళ మేల్కొంటే నరకాసురుడైనా... మహిషాసురుడైనా... ఎవరినైనా వధించేదాకా నిద్రబోదన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మా శక్తి ఏమిటో చూపిస్తామన్నారు. అబ్ కీ బార్... మోదీ సర్కార్ అని నినదించారు.