ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కు ఊరట

  • ఇన్ స్పైర్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ పేరిట బస్సులు కొనుగోలు చేసిన పునీత్
  • జీఎస్టీ చెల్లించలేదంటూ కేసు నమోదు
  • ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పునీత్
  • తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు
బస్సులు కొనుగోలు చేసి జీఎస్టీ చెల్లించలేదంటూ నమోదైన కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. బస్సులు కొనుగోలు చేసి జీఎస్టీ చెల్లించలేదన్న ఆరోపణలతో పునీత్ పై కేసు నమోదైంది. దీనిపై పునీత్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 

మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ ఇన్ స్పైర్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ పేరిట బస్సులు కొనుగోలు చేశారు. అయితే ఆ బస్సులకు జీఎస్టీ చెల్లించలేదంటూ సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు నెల్లూరు బాలాజీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ కేసును కొట్టివేయాలంటూ పునీత్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా, ఆ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. పునీత్ ను అరెస్ట్ చేయవద్దని, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు దర్యాప్తును కొనసాగించుకోవచ్చని సూచించింది.


More Telugu News