దర్శకుడు సూర్యకిరణ్ మరణానికి కారణం ఇదే: కరాటే కల్యాణి

  • భార్యతో విడాకులే సూర్యకిరణ్ దుస్థితికి కారణమన్న కరాటే కల్యాణి
  • భార్య దూరం కావడంతో తట్టుకోలేకపోయాడని వెల్లడి
  • తాగుడుకి బానిసయ్యాడని ఆవేదన
సినీ దర్శకుడు సూర్యకిరణ్ మృతి అందరినీ ఆవేదనకు గురి చేస్తోంది. చిన్న వయసులోనే అనారోగ్య కారణాలతో ఆయన చనిపోవడం కలచి వేస్తోంది. కామెర్ల బారిన పడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం వెనకున్న నిజాలను సినీ నటి కరాటే కల్యాణి బయటపెట్టారు. 

భార్యతో విడాకులే సూర్యకిరణ్ దుస్థితికి కారణమని కరాటే కల్యాణి తెలిపారు. హీరోయిన్ కల్యాణిని సూర్యకిరణ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. భార్యను సూర్యకిరణ్ గుండెల నిండా నింపుకున్నాడని, ఆమె దూరం కావడంతో తట్టుకోలేక పోయాడని కరాటే కల్యాణి అన్నారు. ఈ లోకంలో తనకంటూ ఏమీ లేదని తాగుడుకు బానిసయ్యాడని చెప్పారు. రాత్రంతా మందు, సిగరెట్లు తాగుతూ ఉండేవాడని, దీంతో ఆరోగ్యం దెబ్బతిందని తెలిపారు. తాగుడు వల్లే ఆయనకు జాండిస్ వచ్చిందని... జాండిస్ కారణంగానే మృతి చెందాడని చెప్పారు. 

మరోవైపు సూర్యకిరణ్ దర్శకుడే కాకుండా మంచి నటుడు, డ్యాన్సర్, సింగర్ కూడా. బాల నటుడిగా 200కు పైగా చిత్రాలు చేశాడు. నంది అవార్డులు కూడా అందుకున్నాడు. 1990 వరకు ఆయన నటుడిగా కొనసాగాడు. 2003లో వచ్చిన 'సత్యం' సినిమాతో డైరెక్టర్ గా మారాడు. సుమంత్, జెనీలియా జంటగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఆయన సినిమాలు పెద్దగా ఆడలేదు. కొన్నాళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.


More Telugu News