లాభాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్లు

  • సెన్సెక్స్ 113 పాయింట్లు లాభ‌ప‌డి 73,615 వ‌ద్ద, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 22,360 వ‌ద్ద ట్రేడింగ్‌
  • లాభాల్లో టీసీఎస్‌, టెక్ మ‌హీంద్రా, ఇన్ఫోసిస్‌, మారుతీ షేర్లు
  • న‌ష్టాల్లో ఐటీసీ, బ‌జాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా షేర్లు
  • డాల‌రుతో రూపాయి మార‌కం విలువ రూ. 82.72
దేశీయ‌ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. ఉద‌యం తొమ్మిదిన్న‌ర గంట‌ల ప్రాంతంలో సెన్సెక్స్ 113 పాయింట్లు లాభ‌ప‌డి 73,615 వ‌ద్ద, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 22,360 వ‌ద్ద కొన‌సాగుతున్నాయి. 

సెన్సెక్స్-30 సూచీలో టీసీఎస్‌, టెక్ మ‌హీంద్రా, ఇన్ఫోసిస్‌, మారుతీ, టాటా మోటార్స్‌, ఎల్ అండ్ టీ, భార‌తీ ఎయిర్‌టెల్, విప్రో షేర్లు లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. ఐటీసీ, బ‌జాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్‌, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, ప‌వ‌ర్ గ్రిడ్‌ షేర్లు న‌ష్టాల్లో ఉన్నాయి. ఇక రూపాయి మార‌కం విలువ డాల‌రుతో పోలిస్తే రూ. 82.72 వ‌ద్ద ప్రారంభ‌మైంది.


More Telugu News