తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది: హరీశ్ రావు
- కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపణ
- కాంగ్రెస్ పార్టీ చెప్పింది కొండంత... చేస్తుంది మాత్రం గోరంతే అని ఆగ్రహం
- ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తానని చెప్పిందని... కానీ ఆ హామీ ఏమైంది? అని ప్రశ్న
తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందన్న బీజేపీ, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కానీ తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది కొండంత... చేస్తుంది మాత్రం గోరంతే అని విమర్శించారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తానని చెప్పిందని... కానీ ఆ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.