3 రోజుల్లో 20 కోట్లు .. దూసుకుపోతున్న 'గామి'
- ఈ నెల 8వ తేదీన విడుదలైన 'గామి'
- లుక్ తోనే అంచనాలు పెంచిన విష్వక్ సేన్
- కొనసాగుతున్న వసూళ్ల జోరు
- ముఖ్యమైన పాత్రను పోషించిన చాందినీ చౌదరి
విష్వక్సేన్ హీరోగా 'గామి' సినిమా రూపొందింది. ఆయన అఘోరాగా నటించిన ఈ సినిమాను కార్తీక్ శబరీశ్ నిర్మించగా, విద్యాధర్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. నిన్నటితో ఈ సినిమా 3 రోజులను పూర్తిచేసుకుంది. ఈ 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20.3 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.
ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలింది. రిలీజ్ కి ముందే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకు కారణం అఘోరాగా విష్వక్ లుక్ .. హిమాలయాల నేపథ్యంలో సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ అనే చెప్పాలి. అందువలన కంటెంట్ పట్ల పెరిగిన ఆసక్తి, ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించింది.
ఈ సినిమాను కాశీ .. హిమాలయాల నేపథ్యంలో చిత్రీకరించారు. వినోదానికి చాలా దూరంగా నడిచిన కథ ఇది. ఈ కథకి డివోషనల్ టచ్ ఇచ్చినా .. ప్రకృతి శక్తులకు సంబంధించిన టచ్ ఇచ్చినా నెక్స్ట్ లెవెల్లో ఉండేదనే టాక్ వచ్చింది. నరేశ్ కుమరన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి .. అభినయ ముఖ్యమైన పాత్రలను పోషించారు.