ఎన్నికల కమిషనర్ రాజీనామాకు కారణమేంటో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చెప్పాలి: ఒవైసీ
- కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా
- బీజేపీ ఒత్తిడే కారణమని విమర్శిస్తున్న విపక్షాలు
- ఎన్నికల ముందు ఈ పరిణామం షాక్ కు గురి చేసిందన్న ఒవైసీ
కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఒత్తిడి కారణంగానే ఆయన రాజీనామా చేశారని విపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ... రాజీనామాకు గల కారణమేంటో గోయల్ పేర్కొనలేదని... అరుణ్ గోయల్ రాజీనామాకు కారణమేంటో కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం తనను షాక్ కు గురి చేసిందని చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి పార్లమెంటులో బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు.