చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ కల్యాణ్
- ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు
- ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బీజేపీ, జనసేన నేతలు
- సమావేశంలో పాల్గొన్న పవన్ కల్యాణ్
- సీట్ల సర్దుబాటుపై రేపట్లోగా ప్రకటన వెలువడే అవకాశం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు. అప్పటికే అక్కడ చంద్రబాబుతో బీజేపీ నేతలు షెకావత్, బైజయంత్ పండా సమావేశమయ్యారు. తాజాగా ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. ఎవరెక్కడ పోటీ చేసేదీ నేడు గానీ, రేపు గానీ ప్రకటించే అవకాశాలున్నాయి.