స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్!

  • ఐఎస్‌బీ ప్రొఫెసర్ల అధ్యయనాన్ని ప్రచురించిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ 
  • విద్యార్థులు, ప్రొఫెసర్లకు కేస్ స్టడీగా ఎంపిక 
  • ప్రాజెక్టు విజయంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎస్వీఎస్ రెడ్డి బృందం కీలక పాత్ర
ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ విద్యార్థులు, ప్రొఫెసర్లకు కేస్ స్టడీగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును చేర్చారు. సంస్థ ప్రచురించే సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ తాజా సంచికలో దీన్ని ప్రచురించారు. ఇది ఓ భారతీయ సంస్థకు దక్కిన అరుదైన గౌరవమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అభివర్ణించింది. ప్రపంచంలో చేపట్టిన పలు భారీ ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించడానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు, పరిష్కార మార్గాలను ఈ జర్నల్‌లో ప్రచురించారు. ఐఎస్‌బీ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్లు రామ్ నిడుమోలు, ఆయన బృందం హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుపై జరిపిన అధ్యయనాన్ని విశ్వవిద్యాలయం వారు కేస్ స్టడీగా ప్రచురించారు. ప్రాజెక్టును విజయవంతం చేయడంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎస్వీఎస్ రెడ్డి బృందం అసాధారణ నాయకత్వ ప్రతిభను కనబరిచిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.


More Telugu News