యాడ్స్ తో దూసుకుపోతున్న మహేశ్ బాబు, అల్లు అర్జున్
- వాణిజ్య ప్రకటనలతోనూ అలరిస్తున్న అగ్రహీరోలు
- మౌంటెన్ డ్యూ కొత్త యాడ్ లో మహేశ్ బాబు
- ఆస్ట్రాల్ పైప్స్ తో అల్లు అర్జున్ ఒప్పందం
టాలీవుడ్ అగ్రహీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్ సినిమాలతోనే కాదు వాణిజ్య ప్రకటనలతోనూ అలరిస్తుంటారు. ఇద్దరికీ బోల్డంత బ్రాండ్ వాల్యూ ఉంది. ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఐకాన్ స్టార్. ఇద్దరికీ విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా, సోషల్ మీడియాలో వీరిద్దరి క్రేజ్ మరో లెవల్లో ఉంటుంది.
తాజాగా మహేశ్ బాబు, అల్లు అర్జున్ కొత్త యాడ్స్ తో వస్తున్నారు. మహేశ్ బాబు ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ మౌంటెన్ డ్యూ కోసం కొత్త యాడ్ చేశాడు. ఇందులో మహేశ్ చేసిన స్టంట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్ ను తలపించేలా మౌంటెన్ డ్యూ యాడ్ ఉంటుందనడంలో సందేహం లేదు.
ఇక, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేశ్ బాబు మరో యాడ్ లోనూ నటిస్తున్నారు. అది 'అభి బస్' యాప్ కు సంబంధించిన యాడ్. ట్రావెల్స్ సీట్/బెర్త్ బుకింగ్ యాప్ గా 'అభి బస్' ఎంతో ఫేమస్ అని తెలిసిందే. ఈ యాడ్ లో సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ కూడా నటిస్తున్నారు.
అటు, అల్లు అర్జున్ సైతం తన బ్రాండ్ నేమ్ ను మరింత విస్తరిస్తున్నారు. ఆస్ట్రాల్ పైప్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న అల్లు అర్జున్ తాజాగా దానికి సంబంధించిన యాడ్ ఫిలింలో నటించారు. ఈ యాడ్ లో... రౌడీల్లో ఒకరిని అల్లు అర్జున్ ఆస్ట్రాల్ పైప్ తో ఒక్క దెబ్బ కొట్టగా, ఆ రౌడీ కిందపడిపోతాడు. ఆ దెబ్బకు దిమ్మదిరిగిపోయిన ఆ రౌడీ "వాటీజ్ దిస్?" అని ప్రశ్నించగా... "ఆస్ట్రాల్, పైపు లీకయ్యేదే లే" అంటూ బన్నీ బదులివ్వడం ఈ యాడ్ లో చూడొచ్చు.