నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్రకు ఒక వారం విరామం
- స్కిల్ కేసులో నాడు చంద్రబాబు అరెస్ట్
- చంద్రబాబు అరెస్ట్ అనంతరం పలువురు టీడీపీ కార్యకర్తల మృతి
- నిజం గెలవాలి యాత్ర పేరుతో కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ
- హెరిటేజ్ సంస్థ పనుల కోసం కొద్దిగా విరామం తీసుకుంటున్న భువనేశ్వరి
- హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వరి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్కిల్ కేసులో అరెస్టయిన అనంతరం మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర పేరిట కలుస్తున్నారు. ఇప్పటికి వరకు 149 బాధిత కుటుంబాలను పరామర్శించి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు. 66 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6,092 కిలోమీటర్ల మేర భువనేశ్వరి పర్యటన సాగింది.
అయితే, నిర్విరామంగా సాగుతున్న నిజం గెలవాలి కార్యక్రమానికి భువనేశ్వరి వారం విరామం ఇచ్చారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఈ వారంలో జరిగే బోర్డు మీటింగ్స్ కు ఆమె హాజరు కావాల్సి ఉంది.
నిజం గెలవాలి కార్యక్రమం కారణంగా ఆమె పూర్తి సమయం పర్యటనలకే కేటాయిస్తున్నారు. జిల్లాకు వెళ్లిన ప్రతిసారీ 4 నుంచి 5 రోజులు అక్కడే ఉండాల్సి వస్తోంది. దీంతో హెరిటేజ్ ఎండీగా నిర్వర్తించాల్సిన పనులకు నారా భువనేశ్వరి సమయం కేటాయించాల్సి ఉంది.
ఈ కారణంగా ఒక వారం పాటు విరామం ఇచ్చి ఆ పనులు చూసుకోనున్నట్టు భువనేశ్వరి తెలిపారు. వీటితో పాటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యకలాపాలను సైతం సమీక్షించుకునేందుకు ఆమె సమయం వెచ్చించనున్నారు. మళ్లీ వచ్చేవారం నుంచి భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం యధావిధిగా సాగనుంది.