ఈ నెల 14న వైసీపీలో చేరుతున్నా: ముద్రగడ పద్మనాభం
- ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు
- తాడేపల్లిలో సీఎం సమక్షంలో కుమారుడితో సహా వైసీపీలో చేరనున్న ముద్రగడ
- మార్చి 14న కిర్లంపూడి నుంచి తాడేపల్లికి భారీ ర్యాలీ
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14న తాను వైసీపీలో చేరుతున్నానని ముద్రగడ స్వయంగా వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో తాను, తన కుమారుడు గిరి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నామని వివరించారు.
తాను పదవులు ఆశించి వైసీపీలోకి రావడం లేదని, సీఎం జగన్ విజయం కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ముద్రగడ స్పష్టం చేశారు. వైసీపీ నాయకత్వాన్ని ఎలాంటి పదవులు అడగలేదని అన్నారు.
కాగా, మార్చి 14న కిర్లంపూడి నుంచి తాడేపల్లికి భారీ ర్యాలీగా ముద్రగడ తరలిరానున్నట్టు తెలుస్తోంది.