అమెరికాలో భారతీయ యువతి అదృశ్యం!
- న్యూయార్క్ నగరంలో మార్చి 1న అదృశ్యమైన యువతి
- రాత్రి 11 గంటలకు యువతి ఇంటి నుంచి బయటకు వచ్చి కనిపించకుండా పోయిన వైనం
- యువతికి బైపోలార్ డిజార్డర్ ఉందన్న పోలీసులు
- ఆమె ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ ప్రజలకు విజ్ఞప్తి
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ భారతీయ యువతి అదృశ్యమైన ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. మార్చి 1న క్వీన్స్ ప్రాంతంలో ఫెరీన్ ఖోజా అనే యువతి కనిపించకుండా పోయింది. ఆమె కోసం విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు యువతి వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
యువతి బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టు పోలీసులు చెప్పారు. మార్చి 1న ఆమె ఇల్లు వీడాక మళ్లీ కనిపించలేదని అన్నారు. ఆ సమయంలో ఆమె ఆలీవ్ గ్రీన్ జాకెట్, ఆకుపచ్చ స్వెట్టర్, నీలి రంగు జీన్స్ ప్యాంటులో ఉందని న్యూయార్క్ నగర పోలీసు డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. యువతి ఫొటోను కూడా రిలీజ్ చేసింది. 112 ప్రీసింక్ట్ డిటెక్టివ్‌ల బృందం యువతి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా, యువతి అదృశ్యం గురించి పోలీసులు న్యూయార్క్‌లో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాకు కూడా సమాచారం అందించారు. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ఎంబసీ సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్నారు.