మా ప్రభుత్వంపై మగాళ్లకు కోపం..ఏపీ మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు

  • శనివారం శ్రీకాకుళంలోని సింగుపురంలో ‘వైఎస్ చేయూత నగదు పంపిణీ’
  • కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగం
  • భార్యలను డబ్బులు అడగాల్సి రావడంతో ఏపీ పురుషుల్లో అసంతృప్తి ఉందన్న మంత్రి 
  • అందుకే టీడీపీకి ఓటేయాలని అంటున్నారని వ్యాఖ్య
  • సంక్షేమ పథకాలకు కృతజ్ఞతగా వైసీపీకి ఓటేసీ గెలిపించాలని విజ్ఞప్తి
తమ ప్రభుత్వంపై రాష్ట్రంలోని మగాళ్లు కోపంగా ఉన్నారని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రతి అవసరానికి భార్యలను డబ్బులు అడగాల్సి రావడంతో వారు అసంతృప్తితో ఉన్నారన్నారు. అందుకే వారు వచ్చే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని అంటున్నారని చెప్పారు. అయితే, ఇవేమీ పట్టించుకోకుండా వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని, ప్రభుత్వ పథకాలకు కృతజ్ఞత తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో శనివారం నిర్వహించిన వైఎస్ చేయూత నగదు పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘గత ఎన్నికల్లో మీరు అధికారం ఇచ్చారు. మీరు ఓట్లేసి అధికారం ఇచ్చి అయిదేళ్లవుతోంది. ప్రభుత్వ పథకాల పంపిణీ సమయంలో పలుమార్లు ఏర్పాటు చేసిన సమావేశాల్లో మిమ్మల్ని కలిశాను. ఈ ప్రభుత్వంలో ఇదే చివరి సమావేశం. మరో రెండు, మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. తరువాత అధికారులతో ఏర్పాటు చేసే సమావేశాలు ఉండవు’’ అని ధర్మాన తెలిపారు.


More Telugu News