సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా... అంటూ మంత్రి అంబటి ఆసక్తికర ట్వీట్
- పవన్ కల్యాణ్, చంద్రబాబులపై అంబటి విమర్శలు
- సీఎం అంటే చంద్రబాబు మనిషా అంటూ ట్వీట్
- గతంలో చంద్రబాబు వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్న అంబటి
ఏపీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై విమర్శనాస్త్రాలు సంధించారు.
సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా... అంటూ అంబటి ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం అంటే చీఫ్ మినిస్టరా? సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా? సీఎం అంటే చంద్రబాబు మనిషా? సీఎం అంటే చీటింగ్ మనిషా? అంటూ అంబటి కాపు వర్గాన్ని ప్రశ్నించారు.
అంతేకాదు, గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఓ సభలో చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా మంత్రి అంబటి రాంబాబు పోస్టు చేశారు. మోదీ వస్తే ముస్లింల మీద, క్రైస్తవుల మీదా దాడులు జరుగుతాయని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపించారు.