గల్ఫ్ దేశంలో హైదరాబాద్ మహిళకు భర్త వేధింపులు.. తిండి కూడా పెట్టకుండా చిత్రహింసలు
- అరబ్ వ్యక్తిని పెళ్లాడిన హైదరాబాద్ మహిళ
- వరకట్నం పేరిట వేధింపులు
- గదిలో బంధించి తాళం వేసిన వైనం
- వీడియో ద్వారా పేరెంట్స్‌కు తన పరిస్థితిని తెలియజేసిన బాధితురాలు
- తమ కూతురుని కాపాడాలంటూ విదేశాంగ మంత్రికి తల్లిదండ్రుల లేఖ
హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గల్ఫ్ దేశంలో నరకం అనుభవిస్తోంది. అరబ్ వ్యక్తిని పెళ్లాడిన మహిళ.. అక్కడికి వెళ్లిన తర్వాత సదరు వ్యక్తి ఆమెను హింసించడం మొదలెట్టాడు. కనీసం తినడానికి తిండి పెట్టకుండా ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు బాధిత మహిళ తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కూతురుని కాపాడాలంటూ వారు విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన సబా బేగంను అరబ్‌కు చెందిన ముక్తాదీర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.
పెళ్లి తర్వాత అరబ్ దేశానికి వెళ్లిన సబాకు మొదటి రోజు నుంచే చిత్రహింసలు మొదలయ్యాయి. వరకట్నం పేరిట హింసించడం మొదలెట్టాడు భర్త. కనీసం తిండి కూడా పెట్టకుండా ఓ గదిలో పెట్టి తాళం వేశాడు. ప్రతిరోజు రబ్బర్ మ్యాట్‌తో కొట్టడం చేస్తున్నాడట. సబాకు ఒళ్లంతా దెబ్బలే. కనీసం ఆమెను ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం తమ కూతురు మక్కాలో ఉంటోందని, ఆమెను ఎలాగైనా కాపాడాలని వారు విదేశాంగ శాఖకు రాసిన తమ లేఖలో పేర్కొన్నారు. కాగా, తనపై జరగుతున్న దారుణాన్ని సబా ఒక వీడియో తీసి, తల్లిదండ్రులకు పంపించడంతో ఈ విషయం బయటకు వచ్చింది.