'ఈగల్' విషయంలో నాకు అనిపించింది ఇదే: పరుచూరి గోపాలకృష్ణ

  • గన్ ఫైట్ పై నడిచిన సినిమా 'ఈగల్'
  • అందుకే హాలీవుడ్ మూవీలా ఉందని వెల్లడి 
  • లవ్ .. కామెడీ అవసరమని వ్యాఖ్య 
  • అన్నివర్గాల వారికి అవసమైన అంశాలు ఉండాలని వివరణ 

రవితేజ కథానాయకుడిగా రూపొందిన 'ఈగల్' సినిమా, ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. తాజాగా 'పరుచూరి పాఠాలు'లో ఈ సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ తన మనసులోని మాటను చెప్పారు. 

"ఈ కథను ప్రత్తి రైతుల సమస్యతో మొదలుపెట్టారు. ఇక కథ అటువైపే వెళుతుందని అనుకుంటే, మారణ ఆయుధాల అక్రమ రవాణా వైపు వెళ్లింది. మళ్లీ బాక్సయిట్ కోసం కొండను తవ్వాలి .. అందుకోసం గిరిజనులను ఖాళీ చేయించాలనే గొడవను కూడా చూపించారు. ఫస్టాఫ్ లో లవ్ స్టోరీని చూపించే అవకాశం లేదు. సెకండాఫ్ లో లవ్ ను చూపించే కోణం వేరేగా ఉంది" అని అన్నారు. 

" ఈ సినిమాను దర్శకుడు 'గన్ ఫైట్' పై ఎక్కువగా నడిపించాడు. అందువలన హాలీవుడ్ సినిమాను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక వర్గం ప్రేక్షకులు యాక్షన్ ను .. మరికొందరు ఎమోషన్ ను .. ఇంకొందరు కామెడీని ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కాలం దర్శకులు ఒక విషయాన్ని గమనించాలి. లవ్ .. కామెడీని వదిలేసి ముందుకు వెళ్లడం సాహసమే అవుతుందనే విషయాన్ని గ్రహించాలి" అని చెప్పారు.


More Telugu News