లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం నిర్ణయం
- త్వరలో లోక్ సభ ఎన్నికలు
- తమిళనాడు అధికార డీఎంకే పార్టీకి మద్దతు పలికిన ఎంఎన్ఎం
- డీఎంకే అభ్యర్థుల తరఫున కమల్ హాసన్ పార్టీ ప్రచారం
ప్రముఖ నటుడు కమల్ హాసన్ నాయకత్వంలో మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వాలని ఎంఎన్ఎం పార్టీ నిర్ణయించుకుంది. ఈ ఎన్నికల్లో తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ అభ్యర్థుల కోసం ఎంఎన్ఎం పార్టీ ప్రచారం చేస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం వెల్లడించారు. అందుకు ప్రతిఫలంగా, 2025లో ఎంఎన్ఎం పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఖాయమైందని తెలిపారు.
ఇవాళ ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ చెన్నైలో సీఎం స్టాలిన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు.
ఇవాళ ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ చెన్నైలో సీఎం స్టాలిన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు.