ధర్శశాల టెస్టులో భారత్ ఘన విజయం
- ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో టీమిండియా బంపర్ విక్టరీ
- వందో టెస్టులో 5 వికెట్లు పడగొట్టిన అశ్విన్
- ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న రోహిత్ సేన
ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 259 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 195 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విక్టరీతో రోహిత్ సేన ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ ఒక్కడే 84 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మధ్యలో మరో సీనియర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో 39 పరుగులతో కొద్దిసేపు క్రీజులో కుదురుకున్నట్లు కనిపించాడు.
కానీ, అతడు ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చినా ఇంగ్లీష్ బ్యాటర్లు ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. దాంతో ఇంగ్లండ్ జట్టు 195 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లీష్ జట్టును కుప్పకూల్చాడు. అలాగే కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 218 పరుగులు చేసింది.