‘రామాయణం’లో రావణుడి పాత్రకు రూ. 150 కోట్లు డిమాండ్ చేసిన యశ్!
- నితీశ్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ్’
- రాముడి పాత్రలో రణబీర్ కపూర్
- రావణుడి పాత్రకు కేజీఎఫ్ స్టార్‌ను అడిగిన చిత్ర బృందం
- అభిమానుల అభీష్టం మేరకు ఆఫర్‌ను తిరస్కరించిన యశ్?
- పారితోషికంపై రూమర్లు సినీ ఇండస్ట్రీకి మంచివి కావన్న యశ్ సన్నిహిత వర్గాలు
విలన్ పాత్రకు దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ‘కేజీఎఫ్’ సూపర్ స్టార్ యశ్ రికార్డులకెక్కబోతున్నాడా? ఇప్పుడీ విషయం అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైన విషయంగా మారింది. బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ రూపొందిస్తున్న ‘రామాయణ్’ సినిమాలో రావణుడి పాత్రకు యశ్ ఏకంగా రూ. 150 కోట్లు డిమాండ్ చేసినట్టు బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నాడు.
రావణుడి పాత్రకు యశ్ రూ. 150 కోట్లు డిమాండ్ చేసినట్టు వస్తున్న వార్తలు నిజం కావని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. విలన్ (రావణుడు) పాత్రకు ఇంత మొత్తం తీసుకొనే మొదటి నటుడు అతడేనంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, నిజానికి రావణుడు విలన్ కాదని, ఆయన వ్యక్తిత్వంలో ఎన్నో కోణాలు ఉన్నాయన్న విషయాన్ని తొలుత అందరూ తెలుసుకోవాలని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
నిజానికి రామాయణ్‌లో అతడు నటించకపోవచ్చని తెలుస్తోంది. నటిస్తే గిటిస్తే రాముడిగా చేయాలని రావణాసురుడిగా చేస్తామంటే ఒప్పుకునేదే లేదని అభిమానులు రచ్చ చేయడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు తెలిసింది.
రావణుడి పాత్ర కోసం యశ్ రూ. 150 కోట్లు డిమాండ్ చేశాడట కదా? అని ప్రశ్నించినప్పుడు ఆ వర్గాలు నవ్వేశాయి. ఈ రోజుల్లో ఓ పాత్రకు అంత మొత్తం ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించాయి. ఇలాంటి రూమర్ల వల్ల ఇండస్ట్రీకి ముప్పు తప్పదని హెచ్చరించాయి.