రెండో ఇన్నింగ్స్... ఇంగ్లాండ్ ను కుప్పకూలుస్తున్న అశ్విన్
- తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన భారత్
- రెండో ఇన్నింగ్స్ లో 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
- అశ్విన్ కి మూడు, కుల్దీప్ కు ఒక వికెట్
ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టులో ఘోర పరాజయం దిశగా ఇంగ్లాండ్ ఆట సాగుతోంది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 259 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మరోవైపు, రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ కు స్టార్ స్పిన్నర్ అశ్విన్ చుక్కలు చూపిస్తున్నాడు.
సెకండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ ను బుమ్రా వేయగా... రెండో ఓవర్ ను అశ్విన్ వేశాడు. 1.5 ఓవర్ వద్ద ఓపెనర్ బెన్ డకెట్ ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 5.3 ఓవర్లో మరో ఓపెనర్ జాక్ క్రాలేను పెవిలియన్ చేర్చాడు. అశ్విన్ వేసిన బంతికి స్లిప్ లో ఉన్న సర్ఫరాజ్ కు క్యాచ్ ఇచ్చి క్రాలే ఔటయ్యాడు. 10.3 ఓవర్లో ఒలీ పోప్ ను కూడా అశ్విన్ ఔట్ చేశాడు. అశ్విన్ వేసిన బంతిని స్వీప్ షాట్ ఆడబోయి స్క్వేర్ లెగ్ లో ఉన్న జైస్వాల్ కు పోప్ క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ కు కుల్దీప్ యాదవ్ మరో షాక్ ఇచ్చాడు. 39 పరుగులతో ఆడుతున్న బెయిర్ స్టోను ఔట్ చేశాడు. బెయిర్ స్టో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 4 వికెట్లకు 94 పరుగులు.