ఏమాత్రం స్పందించని దేవుడికి పూజలు ఎందుకు చేయాలి?: బిగ్ బాస్ ఫేమ్ కీర్తి
- అరాచకాలు జరుగుతున్నా దేవుడు ఊరుకుంటున్నాడన్న కీర్తి
- చిన్నారిని గ్యాంగ్ రేప్ చేస్తున్నా దేవుడు ఊరుకున్నాడని ఆవేదన
- దేవుడి ఫొటోలు పక్కన పెట్టి పూజలు చేయడం మానేద్దామనిపిస్తోందని వ్యాఖ్య
బిగ్ బాస్ ఫేమ్, సీరియల్స్ నటి కీర్తి భట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎన్నో సామాజిక విషయాలపై ఆమె నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా శివరాత్రి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా దేవుడిపై ఆమె ఆరోపణలు చేసింది. దేశంలో మహిళలు, అమ్మాయిలపై అరాచకాలు జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడని, అలాంటప్పుడు ఆయనకు పూజలు ఎందుకు చేయాలని ఆమె ప్రశ్నించింది.
శివరాత్రి రోజైనా, మరో రోజైనా మనం దేవుడికి పూజలు ఎందుకు చేస్తాం? అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలనే కదా? అని ప్రశ్నించింది. కానీ మంచి జరగడం లేదని... ఒక చిన్నారిని గ్యాంగ్ రేప్ చేశారని... అప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆ చిన్నారి నరకయాతన అనుభవించి ఉంటుందని... అప్పుడు ఆమెను దేవుడు కాపాడాలని... రేప్ నుంచి తప్పించుకునేలా చేయాల్సి ఉందని వ్యాఖ్యానించింది.
అన్నీ చూస్తూనే దేవుడు ఊరుకుంటున్నాడని... ఒక్కోసారి దేవుడి ఫొటోలు పక్కన పెట్టేసి, పూజలు చేయడం మానేద్దామనిపిస్తుంటుందని కామెంట్ చేసింది. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని... పేదవాళ్లు మరింత పేదవాళ్లు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కీర్తి చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా... మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు.