477 పరుగుల వద్ద ముగిసిన ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్.. 259 పరుగుల ఆధిక్యం
- ఐదు వికెట్లు తీసుకున్న షోయబ్ బషీర్
- భారత జట్టులో శతకాలు బాదిన రోహిత్, గిల్
- రెండో ఇన్నింగ్స్‌లో రెండు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ధర్మశాల టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 477 పరుగుల వద్ద ముగిసింది. 437/8తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 40 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లను కోల్పోయింది. చివరి వికెట్‌గా వెనుదిరిగిన బుమ్రా 20 పరుగులు చేశాడు. ఇక, జట్టులో ఇద్దరు ఆటగాళ్లు రోహిత్‌శర్మ (103), శుభమన్‌గిల్ (110) సెంచరీ చేశారు.
పడిక్కల్ 65, సర్ఫరాజ్‌ఖాన్ 56, కుల్దీప్ యాదవ్ 30 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5 వికెట్లు పడగొట్టగా జేమ్స్ అండర్సన్, టామ్ హర్ట్‌లీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 259 పరుగుల ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ రెండు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో బెన్ డకెట్ (2) బౌల్డయ్యాడు.