శివరాత్రి ఉత్సవాల్లో బాలీవుడ్ పాటలతో హోరెత్తించిన శంకర్ మహదేవన్.. వీడియో ఇదిగో!
- శివరాత్రి వేడుకలు నిర్వహించిన ఇషా ఫౌండేషన్
- నటి పూజాహెగ్డే సహా వేలాదిమంది హాజరు
- భక్తి కార్యక్రమంలో బాలీవుడ్ పాటలు పాడడంపై విమర్శలు
- ఇది ఫిల్మ్‌ఫేర్ స్టేజీ కాదంటూ ఆగ్రహం
- మరోమారు ఆయనను ఆహ్వానించవద్దంటూ సద్గురుకు విన్నపం
మహాశివరాత్రి వేడుకల్లో బాలీవుడ్ పాటలు పాడిన గ్రామీ అవార్డు విజేత, ప్రముఖ సింగర్, మ్యూజిక్ కంపోజర్ శంకర్ మహదేవన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం శివరాత్రి వేడుకలు నిర్వహించారు. 12 గంటలపాటు జరిగిన ఈ వేడుకలకు నటి పూజాహెగ్డే సహా వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. అయితే, శివనామ స్మరణతో భక్తులను తన్మయత్వంతో నింపాల్సిన శంకర్ మహదేవన్ బాలీవుడ్ పాటలు పాడడం విమర్శలకు కారణమైంది.
శంకర్ ఒక్కసారిగా హిందీ పాటలు అందుకోవడంతో ప్రత్యక్షంగా వేడుకల్లో పాల్గొన్నవారితోపాటు లైవ్‌లో చూస్తున్నవారు షాకయ్యారు. శంకర్ మహదేవన్‌ను మరోమారు ఇలాంటి భక్తి కార్యక్రమాలకు ఆహ్వానించవద్దంటూ సద్గురుతో నెటిజన్లు మొరపెట్టుకున్నారు. ఇది ఫిల్మ్‌ఫేర్ వేదిక కాదని మరికొందరు గుర్తు చేశారు. శివరాత్రి వేడుకలో బాలీవుడ్ పాటలు పాడడం సిగ్గుచేటని మరికొందరు కామెంట్ చేశారు. ఈవెంట్ బ్యూటీని శంకర్ మహదేవన్ పాడుచేశాడని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను స్వీడన్ నుంచి లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్నానని, శంకర్‌ను మరోమారు ఇలాంటి కార్యక్రమాలకు పిలవొద్దని ఓ భక్తుడు సద్గురును కోరాడు.