సెంచరీ చేసిన గిల్‌కు తండ్రి స్టాండింగ్ ఒవేషన్.. వీడియో ఇదిగో!
- టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తిచేసుకున్న గిల్
- ఈ సెంచరీలో రెండో శతకం
- అంతర్జాతీయ క్రికెట్‌లో 11వ సెంచరీ
ధర్మశాలలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో సెంచరీ చేసిన తన కుమారుడు శుభమన్‌గిల్‌కు తండ్రి లఖ్వీందర్‌సింగ్ సంతోషంతో ఉబ్బితబ్బిబై స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి అభినందించారు. ఈ సిరీస్‌లో గిల్‌కు ఇది రెండో సెంచరీ. ఈ సిరీస్‌లో ఒకానొక దశలో బ్యాట్ ఝళిపించడంలో గిల్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత మాత్రం కుదురుకున్నాడు. విశాఖపట్టణం టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శతకం బాదిన గిల్ రాజ్‌కోట్ టెస్టులో 91 పరుగులు చేశాడు. రాంచీలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ధర్మశాలలో యశస్వి జైస్వాల్ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్ నిదానంగా ఆడుతూ క్రీజులో కుదురుకున్నాడు. 64 బంతుల్లో 39 పరుగులు చేశాడు. షోయబ్ బషీర్ వేసిన 59వ ఓవర్‌లో ఫోర్ కొట్టి సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ వెంటనే స్టేడియంలో సంబరాలు మొదలయ్యాయి. కుమారుడు శతకం పూర్తిచేసిన వెంటనే శభమన్ తండ్రి స్టాండింగ్ ఒవేషన్‌తో కుమారుడికి అభినందనలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, గిల్‌కు టెస్టుల్లో ఇది నాలుగో సెంచరీ కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 11వ సెంచరీ.