హెచ్‌ 1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ

  • మార్చి 6న మొదలైన ప్రక్రియ
  • మార్చి 22తో ముగియనున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
  • ‘మైయూఎస్‌‌సీఐఎస్‌’ సంస్థాగత ఖాతాలను ప్రారంభించాలని యూఎస్‌సీఐఎస్‌ సూచన
ఆర్థిక సంవత్సరం 2025కి సంబంధించిన హెచ్‌ 1బీ వీసా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రకటన వెలువడింది. ‘మైయూఎస్‌‌సీఐఎస్‌’ సంస్థాగత ఖాతాలను ప్రారంభించాలని ‘ది యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌’ (యూఎస్‌సీఐఎస్‌) సూచించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ క్రమబద్ధీకరణ, సహకారం కోసం సంస్థాగత ఖాతాలను తెరవాలని సూచించింది. తాజా ప్రకటన ప్రకారం మార్చి 6న హెచ్‌ 1బీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యిందని గుర్తు చేసింది. కాగా రిజిస్ట్రేషన్ మార్చి 22న ముగుస్తుంది. ఎంపికైన దరఖాస్తుదారులను మార్చి 31న ప్రకటించనున్నారు. ఎంపికైన వారు తమ దరఖాస్తులను ఏప్రిల్‌ 1న సమర్పించాల్సి ఉంటుంది.

కాగా యూఎస్‌ ఫెడరల్‌ ఏజెన్సీ ఈ ఏడాది జనవరిలో లాటరీ వ్యవస్థలో కీలక మార్పులు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరీన్‌ జీన్‌ పియర్‌ ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. బ్యాక్‌లాగ్ గ్రీన్‌కార్డ్‌లు, హెచ్‌ 1బీ వీసా దరఖాస్తులు, చట్టపరమైన ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థలోని సమస్యల పరిష్కారానికి అధ్యక్షుడు జో బైడెన్‌ కట్టుబడి ఉన్నారని అన్నారు.


More Telugu News