గిల్‌ను 3వ స్థానంలో ఆడించడంపై తండ్రి అసంతృప్తి

  • గిల్‌ను 3వ స్థానంలో దింపడం సరైన నిర్ణయం కాదన్న తండ్రి లఖ్విందర్ 
  • డ్రెస్సింగ్ రూమ్‌లో ఎక్కువ సేపు ఉంటే అతడిపై ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్య
  • మూడో స్థానం అంటే మిడిలార్డరేనని కామెంట్
భారత బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ను మూడో స్థానంలో ఆడించడంపై అతడి తండ్రి, కోచ్ లఖ్విందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అతడిని ఓపెనర్‌గా ఆడించకపోవడం సరైన నిర్ణయం కాదని అన్నారు. ‘‘స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజు నుంచి ముందుకెళ్లి ఆడటం వల్లే గిల్ మళ్లీ పరుగులు రాబట్టగలిగాడు. అండర్-16 రోజుల నుంచి స్పిన్నర్లు, పేసర్ల బౌలింగ్‌లో గిల్ వికెట్ల ముందుకొచ్చి ఆడుతున్నాడు. ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం అతడు కొనసాగించాలి. మూడో నంబర్‌లో ఆడటం సరైంది కాదని నా అభిప్రాయం. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎక్కువ సేపు కూర్చుంటే ఒత్తిడి పెరుగుతుంది. మూడో నంబర్ అంటే మిడిలార్డరే’’ అని లఖ్విందర్ అభిప్రాయపడ్డారు. యశస్వి జట్టులోకి వచ్చాక గిల్ మూడో స్థానంలో ఆడుతున్న విషయం తెలిసిందే. 

ఇంగ్లండ్‌తో ప్రస్తుత సిరీస్‌కు ముందు 12 ఇన్నింగ్స్ ఆడినా ఒక్క అర్ధశతకం కూడా చేయలేకపోయాడు. మరోవైపు, రంజీల్లో ఛటేశ్వర్ పూజారా అద్భుత ఫాం కనబరచడంతో గిల్ స్థానంలో అతడు ఆరంగేట్రం చేయొచ్చన్న వ్యాఖ్యలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న గిల్ టెస్టుల్లో తొలిసారిగా సెంచరీ సాధించి విమర్శకులకు దీటైన సమాధానం ఇచ్చాడు. మూడో స్థానంలో ఆడుతూనే అతడీ శతకం సాధించాడు. ఆ తరువాత శుక్రవారం ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లోనూ మరోమారు మూడంకెల స్కోరు చేసి తన సత్తా చాటాడు. అయితే, గిల్‌ను మూడో స్థానంలో ఆడించడంపై అతడి తండ్రి, తొలి కోచ్ లఖ్విందర్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు.


More Telugu News