తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీదే హవా... ఏపీలో వైసీపీ దూకుడు: టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడి
- కాంగ్రెస్ 8-10, బీజేపీ 4- 6, బీఆర్ఎస్ 2-4 సీట్లు గెలుచుకోవచ్చునని విశ్లేషించిన సర్వే
- పలు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి సత్తా చాటనుందన్న సర్వే
- ఏపీలో వైసీపీకి 21-22 సీట్లు... టీడీపీ, జనసేన కూటమికి 4 సీట్లు రావొచ్చునని అంచనా
రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటనుందని టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడించింది. 17 లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 8-10, బీజేపీ 4- 6, బీఆర్ఎస్ 2-4 సీట్లు గెలుచుకోవచ్చునని విశ్లేషించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తొలి జాబితాను విడుదల చేశాయి. 195 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను, 69 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మొదటి జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలో ఈ సర్వే విడుదలైంది. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి సత్తా చాటనుందని ఈ సర్వే వెల్లడించింది. కేంద్రంలో 300 స్థానాలకు పైగా సాధించి బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వేలో వెల్లడైంది. గుజరాత్ లో 26కి 26 ఎంపీ స్థానాలు ఎన్డీయే కైవసం చేసుకుంటుందని సర్వే పేర్కొంది.
దక్షిణాదిన ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు రావొచ్చు?
ఆంధ్రప్రదేశ్‌లో... వైసీపీ: 21-22, టీడీపీ+జనసేన: 3-4, ఎన్డీయే: 0, ఇతరులు : 0
కేరళలో... ఎన్డీయే: 0-1, ఇండియా కూటమి: 18-20, ఇతరులు : 0
కర్ణాటకలో... బీజేపీ: 21-23, కాంగ్రెస్: 4-6, జేడీఎస్: 1-2, ఇతరులు: 0
తమిళనాడులో... - ఎన్డీయే: 2-6, ఇండియా కూటమి: 29-35, అన్నాడీఎంకే: 1-3, ఇతరులు: 0-2
మహారాష్ట్రలో... ఎన్డీయే: 34-38, ఇండియా కూటమి: 9-13, ఇతరులు : 0-1 సీట్లు రావొచ్చునని అంచనా వేసింది.