బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ భేటీ రేపటికి వాయిదా
- ఏపీలో టీడీపీ-జనసేన మధ్య పొత్తు
- బీజేపీని కూడా పొత్తుకు ఆహ్వానిస్తున్న వైనం
- నిన్న రాత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ సమావేశం
- నేడు మరోసారి సమావేశం కావాలని భావించిన నేతలు
- అమిత్ షా, నడ్డాలకు సమయం కుదరకపోవడంతో భేటీ వాయిదా
టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీని కూడా కలుపుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిన్నటి నుంచి ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే. గతరాత్రి పొద్దుపోయాక అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసిన చంద్రబాబు, పవన్ అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ఇవాళ కూడా సమావేశమవ్వాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు.
అయితే, ఇవాళ్టి సమావేశం వాయిదా పడింది. అమిత్ షా, జేపీ నడ్డాలకు సమయం కుదరకపోవడంతో నేడు సమావేశమయ్యేందుకు సాధ్యపడలేదు. దాంతో రేపు సమావేశం కావాలని నిర్ణయించారు. అమిత్ షా రేపు పాట్నా వెళ్లనుండగా, ఆ పర్యటనకు ముందు కలిసేందుకు చంద్రబాబు, పవన్ లకు ఆయన అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేపు కూడా చంద్రబాబు, పవన్ ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది.