నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: కల్వకుంట్ల కవిత
- రేవంత్ రెడ్డి రేసు గుర్రమేమీ కాదని... గుడ్డి గుర్రమేనని వ్యాఖ్య
- రేవంత్ రెడ్డి మూణ్ణెళ్ల ముఖ్యమంత్రి అని ఎద్దేవా
- రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారని విమర్శ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేసు గుర్రమేమీ కాదని... గుడ్డి గుర్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి మూణ్ణెళ్ల ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళకు రావాలని... గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్‌లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారన్నారు.
ఓ అమ్మాయి చనిపోతే రాజకీయానికి వాడుకున్నారని... కోర్టు తీర్పు పేరు చెప్పి రేవంత్ తప్పించుకున్నారన్నారు. జీవో 3 నిజమైతే 30వేల ఉద్యోగాల్లో ఎంత రిజర్వేషన్లు అమలు చేశారో చెప్పాలన్నారు. నిరుద్యోగులు డైలమాలో ఉన్నారన్నారు. నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో మహిళలతో పెట్టుకున్న వారెవరూ బాగుపడ్డ దాఖలాలు లేవన్నారు. తమ పోరాటం మహిళల కోసమే కానీ పురుషులకు అన్యాయం చేయాలని కాదని స్పష్టం చేశారు.