పాకిస్థాన్ చరిత్రలోనే తొలిసారి.. మంత్రిగా సిక్కు నేత

  • పంజాజ్ ప్రావిన్స్ మైనార్టీ వ్యవహారాల మంత్రిగా రమేశ్ సింగ్ అరోరా
  • నవాజ్ షరీఫ్ పార్టీ తరపున మూడోసారి గెలిచిన రమేశ్
  • పాక్ అధ్యక్షుడి చేతుల మీదుగా 2016లో మానవహక్కుల అవార్డు అందుకున్న రమేశ్
పాకిస్థాన్ చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమయింది. సాధారణంగా ఆ దేశంలో హిందూ, సిక్కు, క్రిస్టియన్ తదితర మైనార్టీలు అత్యున్నత పదవులను అధిరోహించడం దాదాపు అసంభవం. అలాంటిది ఒక సిక్కు నేత పాకిస్థాన్ లో తొలి సిక్కు మంత్రిగా ఎన్నికయ్యరు. 49 ఏళ్ల సర్దార్ రమేశ్ సింగ్ అరోరా పంజాబ్ ప్రావిన్స్ లో మైనార్టీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. 

పాకిస్థాన్ మైనార్టీ నాయకుల్లో రమేశ్ సింగ్ అరోరా శక్తిమంతమైన నేతగా ఉన్నారు. నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ నేత అయిన రమేశ్ సింగ్ ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో గెలిచి మూడోసారి పంజాజ్ ప్రావిన్స్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. రమేశ్ కు పాక్ ఆర్మీతో మంచి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. 2016లో పాకిస్థాన్ అధ్యక్షుడి చేతుల మీదుగా ఆయన మానవహక్కుల అవార్డును అందుకున్నారు. 1974 అక్టోబర్ 11న నరోవల్ జిల్లా నన్కానా సాహిబ్ లో జన్మించారు.


More Telugu News