ఆ క్షణాలు ఎంతో ప్రత్యేకం.. మహిళా దినోత్సవంపై సచిన్ స్పెషల్ ట్వీట్
- 2008లో ఇంగ్లండ్‌పై విజయం తర్వాత జరిగిన ఆసక్తికర ఘటనను గుర్తు చేసిన సచిన్
- మహిళా గ్రౌండ్ స్టాఫ్ వచ్చి అభినందించడం మరిచిపోలేనన్న మాస్టర్ బ్లాస్టర్
- భారత మొదటి మహిళా పిచ్ క్యురేటర్ జసింత కళ్యాణ్ ప్రస్తావన
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సచిన్ చేసిన ఆ స్పెషల్ ట్వీట్‌లో ఏముందంటే.. 'ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. 2008లో 26/ 11 ఘటన తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆ జట్టుపై విజయం సాధించినప్పుడు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా గెలవగానే ఓ మహిళా గ్రౌండ్ స్టాఫ్ వచ్చి అభినందించారు. ఆ క్షణాలు చాలా ప్రత్యేకం. ఆ క్షణాలు మదిలో ఎప్పటికీ మధుర జ్ఞాపకాలుగా అలా మిగిలిపోతాయి. ఆ తర్వాత ఏళ్లు గడిచాయి. తిరిగి 2024లో ఏకంగా ఓ మహిళ పిచ్ క్యురేటర్ అయ్యారు. జసింత కళ్యాణ్ అనే మహిళ భారత్‌కు మొదటి పిచ్ క్యురేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అడ్డంకులను దాటుకుని రోల్ మోడల్స్‌గా నిలుస్తున్న మహిళలను ప్రోత్సహిద్దాం' అని సచిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.