లోక్ సభ ఎన్నికలకు కాసేపట్లో కాంగ్రెస్ తొలి జాబితా... తెలంగాణ నుంచి ఈ తొమ్మిది మంది?

  • మొదటి జాబితాలో తెలంగాణ నుంచి 9 నుంచి 11 మందిని ప్రకటించే అవకాశం
  • దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలకు చెందిన 60 లోక్ సభ అభ్యర్థుల ప్రకటన?
  • తెలంగాణలో 9 నియోజకవర్గాలకు ప్రచారంలో బొంతు రామ్మోహన్ సహా వీరి పేర్లే...
లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం శుక్రవారం సాయంత్రం విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 9 నుంచి 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవచ్చునని తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాలు సహా పది రాష్ట్రాలలో అరవై సీట్లకు అభ్యర్థులను ప్రకటించవచ్చునని తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను 9 నుంచి 11 మంది అభ్యర్థులను ప్రకటించవచ్చునని సమాచారం. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, చేవెళ్ల నుంచి సునితా మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, మెదక్ నుంచి నీలం ముదిరాజ్ పేర్లను ప్రకటించవచ్చునని ప్రచారం సాగుతోంది.


More Telugu News