నైజీరియాలో సాయుధ ముఠాల దుశ్చర్య... 280 మంది చిన్నారుల అపహరణ
- చికున్ జిల్లాలపై సాయుధ దుండగుల దాడులు
- పెద్ద ఎత్తున బాలల కిడ్నాప్
- రంగంలోకి దిగిన ప్రభుత్వ బలగాలు
నైజీరియాలో సాయుధ ముఠాలు పాఠశాలలపై దాడులు చేసి 280 మంది చిన్నారులను అపహరించాయి. కడునా రాష్ట్రంలోని చికున్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ పాఠశాలలపై దాడులు చేసి విద్యార్థులను కిడ్నాప్ చేయడం తరచుగా జరుగుతుంటుంది. అటవీ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకునే సంచార జాతులకు చెందిన వారు సాయుధ ముఠాలుగా ఏర్పడి డబ్బు కోసం ఇలా దాడులకు, కిడ్నాప్ లకు పాల్పడుతుంటారు.
ఈ ఉదయం చికున్ జిల్లాలోని కురిగా స్కూల్ పై భారీ సంఖ్యలో సాయుధులు దాడికి దిగారు. ఓ టీచర్ ను, మరో 187 మంది విద్యార్థులను కిడ్నాప్ చేశారు. మరో పాఠశాలపై దాడి చేసి పెద్ద సంఖ్యలో చిన్నారులను అహపరించారు. అపహరణకు గురైన బాలలు 8 నుంచి 15 ఏళ్ల లోపు వయసున్న వారు. కిడ్నాప్ కు గురైన వారిలో పలువురు చిన్నారులు తప్పించుకున్నారు.
కాగా, సాయుధ ముఠాల దుశ్చర్యపై నైజీరియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. చిన్నారులను విడిపించేందుకు ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగాయి.