మేం రష్యా అధ్యక్షుడి వైపే ఉన్నాం... ఉక్రెయిన్ వివాదంలో భారత్ వైఖరిని మరోసారి చాటిన జై శంకర్

  • కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
  • భారత ప్రధాని మద్దతు రష్యాకేనన్న జై శంకర్
  • యుద్ధం కొనసాగాలని తాము కోరుకోవడంలేదని స్పష్టీకరణ 
రష్యా-ఉక్రెయిన్ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్ వివాదంలో భారత ప్రధాని రష్యా అధ్యక్షుడికే మద్దతు తెలుపుతున్నారని పునరుద్ఘాటించారు. అయితే ఈ యుద్ధం కొనసాగాలని తాము కోరుకోవడంలేదని అన్నారు. 

కొన్ని దేశాలు ఒక సమస్యను తీసుకుని దాన్నే ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉంటాయని, అలాంటి రాజకీయాల గురించి భారత్ కు బాగా తెలుసని జై శంకర్ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చాక భారత్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని, సరిహద్దులు మార్చే ప్రయత్నాలు జరిగాయని, ఇప్పటికీ భారత భూభాగం కొంత ఆక్రమణలకు గురైందని వెల్లడించారు. 

కానీ, పలుదేశాలు ఈ అంశాల గురించి మాట్లాడుకుండా, కొన్ని సూత్రాలు పాటించాలని భారత్ కు చెబుతుంటాయని జై శంకర్ విమర్శించారు. గత 80 ఏళ్లుగా జరుగుతున్నది ఇదేనని అన్నారు. 

ఉక్రెయిన్ వివాదంలో భారత్ ను ప్రశ్నిస్తున్న దేశాలు గతంలో భారత్ కు అన్యాయం జరిగితే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అయితే, భారత్ ఎప్పుడూ తనకు జరిగిన అన్యాయాన్ని ఇతర దేశాలకు కూడా జరగాలని కోరుకోదని స్పష్టం చేశారు.


More Telugu News