మహిళా రిపోర్టర్‌ను అనుచితంగా తాకిన రోబో.. వీడియో ఇదిగో!
- సౌదీఅరేబియాలో చోటు చేసుకున్న ఆసక్తికర ఘటన
- సౌదీ తొలి పురుష హ్యుమనాయిడ్ రోబో మహిళను తాకిందంటూ వైరల్‌గా మారిన వీడియో
- సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు
సౌదీ అరేబియా మొట్టమొదటి పురుష మానవరూప రోబో (హ్యుమనాయిడ్ రోబోట్) వివాదాస్పద చర్చకు దారితీసింది. ఒక మహిళా రిపోర్టర్ ను రోబో అనుచితంగా తాకడం ఇందుకు కారణమయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోబో పక్కన నిల్చొని సదరు మహిళ రిపోర్టింగ్ చేస్తుండగా ఎడమ చేతితో మహిళను రోబో అనుచితంగా తాకింది. రోబో తొలి ప్రదర్శన సమయంలో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఈ వీడియో క్లిప్పింగ్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతికంగా రోబో విఫలమైందని, సాధారణ పనితీరుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. ఏఐ రోబోకి ఎవరు శిక్షణ ఇచ్చారని మరో వ్యక్తి ప్రశ్నించాడు. అయితే సాధారణ కదలికలో భాగంగానే చేతిలో మూమెంట్ కనిపించిందని మరికొందరు సమర్థిస్తున్నారు. తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు. ‘ఇది రోబో తప్పు కాదు. మానవుల తప్పు’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వీడియో తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది. కేవలం ఒక్క రోజులోనే 840,000 వ్యూస్ వచ్చాయి.
కాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగిన డీప్‌ఫాస్ట్ రెండవ ఎడిషన్‌లో ఈ హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సౌదీ పురోగతిని చాటిచెప్పాలనే ఉద్దేశంతో ఒక జాతీయ ప్రాజెక్ట్‌గా ఈ రోబోను రూపొందించారు. అల్ అరేబియా బ్రాడ్‌కాస్టర్ నయీఫ్ అల్ అహ్మరీ మోడల్ వాయిస్‌తో రోబో తనను తాను పరిచయం చేసుకుందని వార్తా సంస్థ ‘అల్ అరేబియా’ కథనం పేర్కొంది.