అమిత్ షా నుంచి చంద్రబాబు లిఖితపూర్వక హామీ తీసుకోవాలి: లక్ష్మీనారాయణ
- ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు... కాసేపట్లో అమిత్ షాతో భేటీ
- ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై రాతపూర్వక హామీ తీసుకోవాలని సూచన
- బీజేపీతో పొత్తు ఖరారుకు ముందే చంద్రబాబు ఈ పని చేయాలని స్పష్టీకరణ
- ఆ లిఖితపూర్వక హామీని ఏపీ ప్రజలకు చూపించాలంటూ ట్వీట్
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ ఆసక్తికరంగా స్పందించారు. బీజేపీతో పొత్తు ఖరారు చేసుకోవడానికి ముందే చంద్రబాబు కొన్ని అంశాలపై అమిత్ షా నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకోవాలని సూచించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడం, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న హామీల అమలు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉపసంహరణ, విశాఖ రైల్వే జోన్ కేటాయింపు హేతుబద్ధీకరణ అంశాలపై చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అమిత్ షా నుంచి హామీ పత్రం తీసుకోవాలని స్పష్టం చేశారు. అంతేకాదు, ఆ లిఖితపూర్వక హామీని ఏపీ ప్రజలకు చూపించాలని తెలిపారు.