ధరణి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత... స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం: మంత్రి పొంగులేటి

  • 6 రోజుల్లోనే 76వేలకు పైగా ధరణి సమస్యలను పరిష్కరించినట్లు వెల్లడి
  • బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను హడావుడిగా తీసుకువచ్చిందని ఆరోపణ
  • మార్చి 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్పెషల్ డ్రైవ్ జరుగుతోందన్న మంత్రి
ధరణి సమస్యల పరిష్కారానికి తమ తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్పెషల్ డ్రైవ్‌‌తో ధరణి సమస్యలు ఒక్కొక్కటీ కొలిక్కి వస్తున్నాయన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 6 రోజుల్లోనే 76వేలకు పైగా ధరణి సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో లక్షలాది సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు.

వీటిని పరిష్కరించేందుకు ఎమ్మార్వో స్థాయి అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను హడావుడిగా తీసుకువచ్చిందని ఆరోపించారు. అందుకే ధరణికి సంబంధించి దాదాపు రెండున్నర లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. మార్చి 1వ తేదీ నుంచి ఈ దరఖాస్తుల స్పెషల్ డ్రైవ్ జరుగుతోందన్నారు.


More Telugu News