గవాస్కర్ రికార్డుకు చేరువలోకి వచ్చిన యశస్వి జైస్వాల్
- ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో జైస్వాల్ పరుగుల వెల్లువ
- ఈ సిరీస్ లో ఇప్పటివరకు 712 పరుగుల నమోదు
- ఓ సిరీస్ లో అత్యధికంగా 774 పరుగులు చేసిన గవాస్కర్
- గవాస్కర్ రికార్డుకు 62 పరుగుల దూరంలో జైస్వాల్
సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో రికార్డుకు చేరువయ్యాడు.. టీమిండియా తరఫున ఓ టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగుల రికార్డు ఇప్పటివరకు సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. 1970-71లో వెస్టిండీస్ పర్యటనలో గవాస్కర్ 774 పరుగులు చేశాడు. ప్రస్తుతం జైస్వాల్ ఇంగ్లండ్ తో సిరీస్ లో 712 పరుగులు చేశాడు. గవాస్కర్ రికార్డుకు జైస్వాల్ మరో 62 పరుగుల దూరంలో ఉన్నాడు.
ఈ జాబితాలో రెండో స్థానానికి చేరే క్రమంలో జైస్వాల్... మాజీ సారథి విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. కోహ్లీ 2014-15 సీజన్ లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 692 పరుగులు చేశాడు. ఇప్పుడీ జాబితాలో కోహ్లీని జైస్వాల్ వెనక్కి నెట్టాడు.
ఇంగ్లండ్ తో సిరీస్ లో జైస్వాల్ రెండు డబుల్ సెంచరీలతో పరుగుల మోత మోగించిన సంగతి తెలిసిందే. ధర్మశాల టెస్టులో ఇవాళ టీమిండియా తొలి ఇన్నింగ్స్ లోనూ జైస్వాల్ దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించాడు. 58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 57 పరుగులు చేశాడు.