ధర్మశాల టెస్టులో కుల్దీప్ యాదవ్ విజృంభణ.. కుప్పకూలిన ఇంగ్లండ్
- 5 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డివిరిచిన కుల్దీప్
- 100వ టెస్టు ఆడుతున్న అశ్విన్‌కు 2 వికెట్లు
- భారత స్పిన్నర్ల దెబ్బకి ఇంగ్లండ్ విలవిల
ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టులో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విజృంభించడంతో ఇంగ్లండ్ విలవిలలాడుతోంది. కుల్దీప్ ఏకంగా ఐదు వికెట్లతో ఇంగ్లీష్ జట్టును కోలుకోని దెబ్బ తీశాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోగా అందులో ఐదు వికెట్లు కుల్దీప్‌కే దక్కాయి. అర్ధశతకం (79) తో మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జాక్ క్రాలీతో పాటు డకెట్, ఓలీ పోప్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇక వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు. మరో వికెట్ రవీంద్ర జడేజాకు దక్కింది. ఇలా ఇప్పటివరకు పడిన ఎనిమిది వికెట్లు కూడా స్పిన్నర్లే తీయడం గమనార్హం.
ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక జట్టును భారత స్పిన్నర్లు దెబ్బ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డకెట్ (27), బెయిర్ స్టో (29), జో రూట్ (26) పరుగులు చేయగా.. కెప్టెన్ బెన్‌స్టోక్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 55 ఓవర్లు ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.