100 టెస్టులు ఆడిన భార‌త క్రికెట‌ర్లు వీరే!

  • ధ‌ర్మ‌శాల వేదిక‌గా వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న అశ్విన్‌
  • ఇప్ప‌టివ‌ర‌కు 14 మంది భార‌త క్రికెట‌ర్ల పేరిట‌ ఈ ఫీట్ 
  • అత్య‌ధిక టెస్టులు ఆడింది మాత్రం స‌చిన్‌
ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లండ్ జ‌రుగుతున్న ఐదో టెస్ట్.. భార‌త దిగ్గ‌జ స్పిన్న‌ర్ అశ్విన్‌కు వందో టెస్టు మ్యాచ్ అనే విష‌యం తెలిసిందే. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు 14 మంది భార‌త క్రికెట‌ర్లు ఈ ఫీట్‌ను సాధించ‌డం జ‌రిగింది. వీరిలో స‌చిన్ టెండూల్క‌ర్‌, సునీల్ గ‌వాస్క‌ర్ , క‌పిల్ దేవ్‌, వెంగ్‌స‌ర్కార్, వీరేంద్ర సెహ్వాగ్‌, వీవీఎస్‌ ల‌క్ష్మ‌ణ్, అనిల్ కుంబ్లే, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, ఛ‌టేశ్వ‌ర్ పుజార‌, విరాట్ కోహ్లీ, ఇషాంత్ శ‌ర్మ‌, సౌర‌భ్‌ గంగూలీ, రాహుల్ ద్ర‌విడ్ ఉన్నారు. 

ఇక టీమిండియా త‌ర‌ఫున అత్య‌ధిక టెస్టులు ఆడింది మాత్రం మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌. 24 ఏళ్ల‌ త‌న సుదీర్ఘ అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో లిటిల్ మాస్ట‌ర్ మొత్తం 200 టెస్టు మ్యాచులు ఆడ‌డం విశేషం. ఆ త‌ర్వాత టాప్‌-5లో ద్ర‌విడ్ (163), ల‌క్ష్మ‌ణ్ (134), అనిల్ కుంబ్లే (132), క‌పిల్‌దేవ్ (131), సునీల్ గ‌వాస్క‌ర్ (125) ఉన్నారు. కాగా, భార‌త్‌కు ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాలు అందించిన కెప్టెన్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ మాత్రం కేవ‌లం 90 టెస్టులు మాత్ర‌మే ఆడారు.


More Telugu News