ఈ దూర ప్రాంతాలకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
- లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులలో బెర్తులపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటన
- ఈ సర్వీసులు తిరిగే అన్ని మార్గాలలోనూ రాయితీ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్
- ఏప్రిల్ 30వ తేదీ వరకు డిస్కౌంట్ వర్తిస్తుందని వెల్లడి
దూర ప్రాంతాలకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పలు స్లీపర్ బస్సులలో 10 శాతం రాయితీని ప్రకటించింది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులలో బెర్తులపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ సర్వీసులు తిరిగే అన్ని మార్గాలలోనూ రాయితీ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే ఇది పరిమిత కాల రాయితీ మాత్రమే. ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే డిస్కౌంట్ వర్తిస్తుంది.
లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు రూట్లలో నడుస్తున్నాయి. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ మార్గాలతో పాటు గోదావరిఖని - బెంగళూరు, కరీంనగర్ - బెంగళూరు, నిజామాబాద్ - తిరుపతి, నిజామాబాద్ - బెంగళూరు, వరంగల్ - బెంగళూరు మార్గాల్లో నడుస్తున్నాయి.