అప్పుడు మాత్రం చాలా భయపడ్డాను: నటి శరణ్య ప్రదీప్
- 'ఫిదా'తో గుర్తింపు తెచ్చుకున్న శరణ్య ప్రదీప్
- ఆ తరువాత వరుస అవకాశాలతో బిజీ
- రీసెంటుగా క్రేజ్ పెంచిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'
- ఆ క్రెడిట్ దర్శకుడిదేనన్న శరణ్య ప్రదీప్
శరణ్య ప్రదీప్ .. ఈ పేరు వినగానే 'ఫిదా' సినిమా గుర్తుకు వస్తుంది .. ఆ సినిమాలో ఆమె సాయిపల్లవి సిస్టర్ గా పోషించిన పాత్ర కళ్లముందు కదలాడుతుంది. ఆ తరువాత వరుస అవకాశాలతో శరణ్య ప్రదీప్ బిజీ అయ్యారు. రీసెంటుగా వచ్చిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమాలో ఆమె పోషించిన 'పద్మ' పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
'ఐ డ్రీమ్' వారికి వచ్చిన ఇంటర్వ్యూలో శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ .. " ఈ సినిమాలో పద్మ పాత్రను వివస్త్రను చేసే సీన్ ఉంది. దర్శకుడు దృష్యంత్ ఈ సీన్ గురించి చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డాను. ఈ సీన్ ఎలా ప్రొజెక్ట్ అవుతుందో .. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఒక సందేహం నన్ను టెన్షన్ పెట్టేసింది" అని అన్నారు.
" ఈ సీన్ విషయంలో దుష్యంత్ కి చాలా క్లారిటీ ఉంది. కంగారు పడవలసిన అవసరం లేదని మా వారు అన్నారు. దాంతో ఈ సీన్ విషయంలో ఎలాంటి విమర్శలు రాకుండా నీట్ గా తీయాలనే బాధ్యతను దర్శకుడిపై పెట్టాను. నిజంగానే ఆయన ఆ సీన్ ను చాలా బాగా తీశాడు. ఆ పాత్ర నాకు మంచి పేరు తీసుకురావడానికి కారణం ఆయనే" అని చెప్పారు.