అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ!: యూపీ కాంగ్రెస్ నేత ప్రదీప్ సింఘాల్
- గత లోక్ సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో పరాజయంపాలైన రాహుల్ గాంధీ
- అమేథీ నుంచి త్వరలో రాహుల్ గాంధీ పేరును ప్రకటిస్తారని యూపీ కాంగ్రెస్ నేత వెల్లడి
- రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారంటూ ప్రచారం
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు ప్రదీప్ సింఘాల్ స్పష్టం చేశారు. అమేథీ నియోజకవర్గం 1967లో ఏర్పడగా అప్పటి నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీయే గెలుస్తూ వస్తోంది. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ 2002 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ కాకుండా మరో పార్టీ గెలవడం ఇదే మొదటిసారి. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారు. అక్కడ విజయం సాధించిన సంగతి విదితమే.
అమేథీ నుంచి రాహుల్ గాంధీ పేరును త్వరలో ప్రకటిస్తారని ప్రదీప్ సింఘాల్ తెలిపారు. అయితే పార్టీ అధిష్ఠానం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు బీజేపీ అమేథీ నుంచి ఈసారి కూడా స్మృతి ఇరానీనే బరిలోకి దింపుతోంది. ఇటీవల 195 అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో అమేథీ నుంచి స్మృతి ఇరానీకి మరోసారి అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా సోనియా గాంధీ స్థానమైన రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.