ఒలింపిక్స్‌లో ‘కొందరు’ గెలిస్తే భారతీయులందరూ గర్వంగా ఫీలవుతారు కదా.. మరి ‘కొందరు’ చేసినదానికి అందరూ సిగ్గుపడరా?: సింగర్ చిన్మయి ఫైర్
- స్పెయిన్ పర్యాటకురాలిపై ఝార్ఖండ్‌లో అత్యాచారం
- తీవ్రంగా స్పందించిన చిన్మయి
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నటుడు దుల్కర్ సల్మాన్, నటి రిచా చద్దా
- నిందితులు 8 మందినీ అరెస్ట్ చేసిన పోలీసులు
ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో స్పెయిన్ పర్యాటకురాలిపై జరిగిన సామూహిక లైంగికదాడిపై గాయకురాలు చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై భారతీయులందరూ సిగ్గుతో తలదించుకోవాలని పేర్కొన్నారు. భర్తతో కలిసి ప్రపంచ పర్యటన చేస్తున్న మహిళ దుమ్కా జిల్లాలోని హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పరిధిలో టెంట్‌లో నిద్రిస్తుండగా కొందరు దుండగులు దాడిచేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఈ ఘటనపై స్పందించిన చిన్మయి.. ఒలింపిక్స్‌లో ‘కొందరు’ భారతీయులు పతకాలు గెలిచినప్పుడు భారతీయులందరూ గర్వపడతారని, అలాగే, స్పెయిన్ మహిళపై ‘కొద్దిమంది’ చేసిన ఈ అఘాయిత్యానికి భారతీయులందరూ సిగ్గుపడాలని రాసుకొచ్చారు.
అత్యాచార ఘటనపై నటుడు దుల్కర్ సల్మాన్, రిచా చద్దా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను చట్టం ముందు నిలబెట్టి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ మాట వినగానే తన చెవులు పగిలిపోయాయన్న దుల్కర్.. వారిద్దరూ ఇటీవలే కొట్టాయం సందర్శించారని, అక్కడ సన్నిహిత మిత్రులు భోజనాలు ఏర్పాటు చేశారని గుర్తుచేసుకున్నారు. ఎవరికీ, ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగకూడదని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశారు.
నటి చద్దా ఈ ఘటనను అవమానకరంగా పేర్కొన్నారు. భారతీయులు తమ ఇంట్లోని స్త్రీలను చూసినట్టుగానే విదేశీయులను చూస్తున్నారని, కుళ్లిపోయిన మన సమాజాన్ని చూస్తే సిగ్గేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అత్యాచార ఘటనతో ప్రమేయం ఉన్న 8 మందినీ పోలీసులు అరెస్ట్ చేశారు.