అమలాపురం ఎంపీ అనురాధ.. మంత్రి విశ్వరూప్ మధ్య విభేదాలు బహిర్గతం

  • అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి విగ్రహావిష్కరణ
  • ఎంపీ అనురాధకు మైక్ ఇవ్వకుండానే సభను ముగించిన మంత్రి విశ్వరూప్
  • విసురుగా వెళ్లిపోయిన అమలాపురం ఎంపీ
అమలాపురం ఎంపీ చింతా అనురాధ, మంత్రి విశ్వరూప్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. వీరిద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని, ఒకరంటే ఒకరికి పడడం లేదంటూ ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలకు బలం చేకూర్చే ఘటన అమలాపురం వేదికగా నిన్న జరిగింది.

స్థానిక గడియారస్తంభం కూడలి వద్ద మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి విగ్రహాన్ని నిన్న ఆవిష్కరించారు. మంత్రి విశ్వరూప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి దాడిశెట్టి రాజాతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రసంగించారు. అంతవరకు బాగానే ఉన్నా ఎంపీ అనురాధకు మైక్ ఇవ్వకుండానే మంత్రి విశ్వరూప్ సభను ముగించారు.

మంత్రి వ్యవహారంతో తీవ్ర అసంతృప్తికి లోనైన అనురాధ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయారు. అక్కడ ఏర్పాటు చేసిన చిట్టబ్బాయి విగ్రహం చుట్టూ పార్కు ఏర్పాటు చేసేందుకు ఆమె రూ. 5 లక్షలు మంజూరు చేశారు. అయినప్పటికీ విశ్వరూప్ ఆమెను అవమానించేలా వ్యవహరించారంటూ ఆమె అనుచరులు మండిపడుతున్నారు.


More Telugu News