378 సీట్లతో చరిత్ర సృష్టించనున్న బీజేపీ... ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తాయంటే: ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే

  • బీజేపీ సొంతగా 335 సీట్లు గెలుచుకోవచ్చునని సర్వేలో వెల్లడి
  • ఎన్డీయే కూటమి 378 సీట్లు గెలుచుకుంటుందన్న సర్వే   
  • ఇతరులు 67 స్థానాల్లో గెలుపొందవచ్చునని విశ్లేషించిన ఒపీనియన్ పోల్  
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సొంతగా 335 సీట్లు సాధించి చరిత్రను సృష్టించే అవకాశముందని ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎన్డీయే కూటమి 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సర్వే ప్రకారం కూటమి 378 సీట్లు గెలుచుకోవచ్చునని వెల్లడించింది. కాంగ్రెస్ సొంతగా 37, ఈ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 98 సీట్లు గెలుచుకునే అవకాశముందని అంచనా వేసింది. ఇతరులు 67 స్థానాల్లో గెలుపొందవచ్చునని విశ్లేషించింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే అదనంగా 32 సీట్లు గెలుచుకోవచ్చునని ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే తెలిపింది.

ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు... ఎవరు గెలిచి అవకాశం?

ఆంధ్రప్రదేశ్: మొత్తం సీట్లు 25 (YSRCP 15, TDP 10) 
అరుణాచల్ ప్రదేశ్: మొత్తం సీట్లు 2 (BJP 2)
అసోం: మొత్తం సీట్లు 14 (BJP 10, AGP 1, UPPL 1, Congress 1, AIUDF 1)
బీహార్: మొత్తం సీట్లు 40 (BJP 17, JD-U 12, RJD 4, LJP(R) 3, RLJP 1, HAM 1, RLM 1, Congress 1)
ఛత్తీస్‌గఢ్: మొత్తం సీట్లు 11 (BJP 10, Congress 1)
గోవా: మొత్తం సీట్లు 2 (BJP 2)
గుజరాత్: మొత్తం సీట్లు 26 (BJP 26)
హర్యానా: మొత్తం సీట్లు 10 (BJP 10) 
హిమాచల్ ప్రదేశ్: మొత్తం సీట్లు 4 (BJP 4)
ఝార్ఖండ్: మొత్తం సీట్లు 14 (BJP 12, AJSU 1, JMM 1)
కర్ణాటక: మొత్తం సీట్లు 28 (BJP 22, JD-S 2, Congress 4)
కేరళ: మొత్తం సీట్లు 20 (UDF 11, LDF 6, BJP 3) – Breakup – Congress -7, CPI-M 4, BJP 3, CPI 1, KC-M 1, IUML 2, RSP 1, Others 1.
మధ్యప్రదేశ్: మొత్తం సీట్లు 29 (BJP 29) 
మహారాష్ట్ర: మొత్తం సీట్లు 48 (BJP 25, Shiv Sena-UBT 8, NCP (Ajit) 4, Shiv Sena-Shinde 6, NCP-Sharad 3, Congress 2)
మణిపూర్: మొత్తం సీట్లు 2 (BJP 1, Congress 1) 
మేఘాలయ: మొత్తం సీట్లు 2 (NPP 2) 
మిజోరాం: మొత్తం సీట్లు 1 (ZPM 1) 
నాగాలాండ్: మొత్తం సీట్లు 1 (NDPP 1) 
ఒడిశా: మొత్తం సీట్లు 21 (BJD 11, BJP 10) 
పంజాబ్: మొత్తం సీట్లు 13 (AAP 6, Congress 3, BJP 3, SAD 1)
రాజస్థాన్: మొత్తం సీట్లు 25 (BJP 25) 
సిక్కిం: మొత్తం సీట్లు 1 (SKM 1) 
తమిళనాడు: మొత్తం సీట్లు 39 (DMK 20, AIADMK 4, BJP 4, Congress 6, PMK 1, Others 4)
తెలంగాణ: మొత్తం సీట్లు 17 (Congress 9, BJP 5, BRS 2, AIMIM 1)
త్రిపుర: మొత్తం సీట్లు 2 (BJP 2) 
ఉత్తర ప్రదేశ్: మొత్తం సీట్లు 80 (BJP 74, Apna Dal 2, RLD 2, SP 2) 
ఉత్తరాఖండ్: మొత్తం సీట్లు 5 (BJP 5) 
పశ్చిమ బెంగాల్: మొత్తం సీట్లు 42 (Trinamool Congress 21, BJP 20, Congress 1) 
అండమాన్ నికోబార్: మొత్తం సీట్లు 1 (BJP 1) 
చండీగఢ్: మొత్తం సీట్లు 1 (BJP 1) 
దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యు: మొత్తం సీట్లు 2 (BJP 2) 
జమ్ము కశ్మీర్: మొత్తం సీట్లు 5 (BJP 2, JKNC 3) 
లడఖ్: మొత్తం సీట్లు 1 (BJP 1) 
లక్షద్వీప్: మొత్తం సీట్లు 1 (Congress 1) 
ఢిల్లీ: మొత్తం సీట్లు 7 (BJP 7) 
పుదుచ్చేరి: మొత్తం సీట్లు 1 (BJP 1) 
మొత్తం: (543 సీట్లు): (ఎన్డీయే 378, I.N.D.I.A. 98, టీఎంసీసహా ఇతరులు 67)


More Telugu News